డీఎస్సీ ఫలితాన్ని ఏ విధంగా అంచనా వేసుకోవాలి?
డీఎస్సీ
మార్కులను ప్రభుత్వం ప్రకటించడంతో పోస్టు వస్తుందా? రాదా? అనే ఆందోళన
అభ్యర్థులందరిలో మొదలైంది. ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు. డీఎస్సీ
పరీక్షతో జిల్లాలు, జోన్ లు, రిజర్వేషన్లు, పోస్టుల సంఖ్య తదితర ఎన్నో
అంశాలు ముడిపడి ఉండటంతో కటాఫ్ అంచనా వేయడం సాధ్యం కాదు. పైగా అభ్యర్థులందరి
మార్కుల లిస్టు లేకుండా అసలు సాధ్యం కాదు. అంచనాలు ఎక్కడికక్కడ
మారిపోతుంటాయి.
కానీ దరఖాస్తు చేసిన అభ్యర్థుల సంఖ్యను ఆధారం చేసుకొని, అందరి మార్కులను నోట్ చేసుకొని ఒక అంచనాకు వచ్చేందుకు కొంత మంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికీ సరైన అంచనాకు రావడం కష్టమే అయినప్పటికీ ఈ కింది కొన్ని సూచనలతో కొంత వరకు ఫలితాన్ని లెక్కగట్టే ప్రయత్నం చేయవచ్చు. |
ఉదాహరణకు బీసీ – బీ విభాగానికి చెందిన మహిళకు అత్యధిక మార్కులు వస్తే ఆమెను ముందుగా ఓపెన్ విభాగం జనరల్ పోస్టుకు పరిశీలిస్తారు. అక్కడ ఆమె కంటే ఎవరికీ ఎక్కువ మార్కులు రాకపోతే పోస్టును ఆమెకే కేటాయిస్తారు. ఒక వేళ అక్కడ ఆమెకు అక్కడ పోస్టు రాకపోతే...
తర్వాత ఓపెన్ మహిళలకు రిజర్వేషన్ కింద కేటాయించిన పోస్టులకు పరిశీలిస్తారు. ఇక్కడ కూడా ఆమె కంటే ఎక్కువ మార్కులు పొందిన వారు ఉంటే,
తర్వాత బీసీ-బీ జనరల్ విభాగంలో పరిశీలిస్తారు. ఆ కేటగిరీ కిందకు వచ్చే వారితో పోల్చి నప్పుడు ఆమెకే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే పోస్టు కేటాయిస్తారు. ఇక్కడ కూడా రాక పోతే...
చివరకు బీసీ – బీ మహిళలకు కేటాయించిన పోస్టుల కోసం ఆమె మార్కులను పరిశీలిస్తారు. ఈ విధంగా నాలుగు దశల్లో ఆమె మెరిట్ ను పరిశీలిస్తారు.
ఇదే విధానాన్ని ఇతర రిజర్వేషన్ వర్గాలకు కూడా అనువర్తింపజేస్తారు.
ఇక్కడ గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఇతర రిజర్వేషన్ల లాగా వీటిని కచ్చితంగా అమలు చేయరు. ఇక్కడ లోకల్ అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
ఉదాహరణకు ఒక జిల్లాలో ఓపెన్ విభాగంలో 90 పోస్టులు ఉన్నాయనుకుంటే నాన్ లోకల్ కి 20 శాతం అంటే 18 పోస్టులు కేటాయిస్తారు. కానీ టాప్ 18 మార్కులు పొందిన వారిలో నాన్ లోకల్ అభ్యర్థులు ఉంటేనే వారికి పోస్టు వస్తుంది. అలా కాకుండా టాప్ 18 లో లోకల్ అభ్యర్థులు ఉంటే వారికే పోస్టు కేటాయిస్తారు. టాప్ 18 లో నాన్ లోకల్ అభ్యర్థులు లేకపోతే ఆ పోస్టులను కూడా లోకల్ అభ్యర్థులతోనే భర్తీ చేస్తారు.
కటాఫ్ అంచనా వేయటం సాధ్యం కాదు కాబట్టీ ఈ సూచనల ఆధారంగా అభ్యర్థులు తమ డిఎస్సీ ఫలితాన్నే అంచనా వేసుకోడానికి ప్రయత్నించవచ్చు.
0 comments:
Post a Comment